tool

SOAPS బైబిల్ పఠనం

ఈ పేజీని పంచుకోండి

యేసు అనుచరులుగా, మనం ప్రతిరోజూ లేఖనాలను చదవాలి. ప్రతి వారం కనీసం 25-30 బైబిల్ అధ్యాయాలను చదవడం మంచి మార్గదర్శకం. రోజువారీ అధ్యయనంలో S.O.A.P.S. బైబిల్ పఠన పద్ధతిని ఉపయోగించడం వలన మీరు అర్థం చేసుకోవడం, పాటించడం మరియు మరింత వాక్యమును పంచుకోవడంలో సహాయపడుతుంది. S.O.A.P.S. అనగా:

  • పర్యవేక్షణ: బాగుగా అర్ధం చేసికొనునట్లు ఆ వచనములను లేక మూల వాక్యములను తిరిగి మరలా వ్రాయండి.   
  • అన్వయింపు: మీ స్వంత జీవితములో ఈ ఆజ్ఞలకు విధేయత చూపుటలోని అర్ధమును గురించి ఆలోచించండి.  
  • ప్రార్ధన: మీరు నేర్చుకొనిన దానిని మరియు దానికి విధేయత చూపుటకు మీరెలా ప్రణాళిక వేసుకున్నారో దానిని దేవునితో చెప్పునట్లు ప్రార్ధనను వ్రాయండి.   
  • పంచుకొనుట: మీరు నేర్చుకొనిన దానిని / అన్వయించుకొనిన దానిని మీరు పంచుకొనవలెనని దేవుడు కోరుకొనునట్లు ఆయనను అడగండి.

 

యేసు అనుచరులెవరైనా ఉపయోగించగల సమర్థవంతమైన బైబిలు అధ్యయన పద్ధతిని తెలుసుకోవడానికి మరియు గుర్తుంచుకోవడానికి ఇది సులభమైన మార్గం.

ఇక్కడ ఎస్ ఓ ఏ పి ఎస్ (S.O.A.P.S.) యొక్క ఉదాహరణలను చూడండి:

ఎస్ - నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు
“ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి”. యెషయా 55:8-9  

– ఒక మానవుడుగా, నాకు తెలిసినది చాలా తక్కువ మరియు ఎలా చేయాలో నాకు తెలియదు. కానీ దేవుడు ఏ విధంగానూ పరిమితమైన వాడు కాదు. ఆయన సమస్తమును చూచును మరియు ఆయన సమస్తమును ఎరుగును. ఆయన దేనినైనా చేయగలడు.  

– దేవునికి సమస్తమును తెలియును గనుక ఆయన మార్గములు ఉత్తమమైనవి, నేను నా స్వంత మార్గములో పనులను చేయకుండా ఆయన మార్గములను అనుసరించినట్లైతే నా జీవితంలో నేను విజయాన్ని పొందుకుంటాను.  

పి – ప్రభువా, మిమ్మును మరియు ఇతరులను సంతోషపరచే మంచి జీవితమును ఎలా జీవించవలేనో నాకు తెలియదు. నా మార్గములు తప్పుడు మార్గములోనికి దారితీస్తాయి. నా ఆలోచనలు గాయపరుస్తాయి. నేను అనుసరించు చుండగా పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించును గాక.  

ఎస్ – నేను ఈ వచనములను మరియు ఈ అన్వయింపును నా స్నేహితుడైన స్టీవ్ తో పంచుకుంటాను, అతడు చాలా కష్టముల గుండా వెళ్తున్నాడు మరియు అతడు ఎదుర్కొంటున్న పరిస్థితులలో ప్రాముఖ్యమైన నిర్ణయముల కొరకు అతనికి నడిపింపు అవసరము.

 

మిమ్మును మీరే ప్రశ్నించుకోండి

  • నా బైబిలు అధ్యయన సమయంలో నేను దేవుని నుండి విన్నదాన్ని పంచుకోవడం నాకు ఎంత ప్రాముఖ్యం?
    • ప్రస్తుతం నేను ఈ సాధనాన్ని భాగస్వామ్యం చేయగల నాకు తెలిసిన వ్యక్తులు ఎవరు?

ఈరోజే Zúme Training ప్రారంభించండి

ఇది పూర్తిగా ఉచితం, మరియు మీరు ఎప్పుడైనా ప్రారంభించవచ్చు—మీరు ఉన్న చోట నుంచే, మీ స్వంత వేగంతో ముందుకు సాగవచ్చు.

ఉచితముగా నమోదు చేసుకోండి