tool

ప్రార్థనలో ఒక గంట ఎలా గడపాలి

ఈ పేజీని పంచుకోండి

ప్రార్థన చక్రం అనేది ప్రార్థనను అభ్యసించడానికి ఒక సాధారణ సాధనం, మీకు మీరే ఉపయోగించుకోవచ్చు మరియు యేసు అనుచరులతో పంచుకోవచ్చు. కేవలం 12 సాధారణ దశల్లో - ఒక్కొక్కటి 5 నిమిషాలు - ప్రార్థన చక్రం బైబిల్ మనకు ప్రార్థన చేయమని బోధించే 12 మార్గాల ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తుంది. చివరికి, మీరు ఒక గంట పాటు ప్రార్థన చేస్తారు. బైబిల్ మనకు చెబుతోంది - "ఎడతెగక ప్రార్థించండి." మనం చేస్తాం అని మనలో చాలామంది చెప్పలేరు. కానీ ఈ ఒక గంట ప్రార్థన తర్వాత - మీరు ఒక అడుగు దగ్గరగా ఉంటారు.

కేవలం 12 సాధారణ దశల్లో - ఒక్కొక్కటి 5 నిమిషాలు - ప్రార్థన చక్రం బైబిల్ మనకు ప్రార్థన చేయమని బోధించే 12 మార్గాల ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తుంది. చివరికి, మీరు ఒక గంట ప్రార్థన చేసి ఉండాలి.

స్తుతి - ప్రభువును స్తుతించుట ద్వారా మీ ప్రార్ధనను ప్రారంభించండి. ఇప్పుడు మీ మనస్సులో ఉన్న వాటిని గురించి మీరు ఆయనను స్తుతించండి. గత వారములో దేవుడు మీకు చేసిన ఒక ప్రత్యేక కార్యమును బట్టి దేవునిని స్తుతించండి. మీ కుటుంబమునకు దేవుడు చూపిన మంచి తనమును బట్టి స్తుతించండి.

వేచియుండుట - దేవుని కొరకు వేచియుండుటలో సమయాన్ని గడుపుము. నిశబ్ధంగా ఉండండి మీ కొరకు ఆయన ప్రతిబింబములను కలిసి తీసుకువచ్చునట్లు అనుమతించండి.  

ఒప్పుకొనుట - దేవునిని సంతోషాపరచు ఏదైనను తెలియజేయుమని పరిశుద్దత్ముని అడగండి. తప్పు వైఖరులను తెలియజేయుమని అలాగే, కొన్ని ప్రత్యేక క్రియల్లో మీరు ప్రార్ధనలో ఒప్పుకోలు చేయని విషయాలను తెలియజేయుమని కోరండి.  మీరు శుద్ధిచేయబడునట్లు దేవుని వద్ద వాటిని ఒప్పుకోండి.

వాక్యమును చదువుట - కీర్తనలు, ప్రవక్తల గ్రంధములు మరియు క్రొత్త నిబంధనలో ప్రార్ధనకు సంబంధించిన వాక్య భాగములను చదువుతూ సమయాన్ని గడపండి.   

అడగండి - మీ కొరకు మీరు విన్నపములను చేయండి.  

విజ్ఞాపన - ఇతరుల పక్షమున విన్నపములు చేయండి.  

వాక్యముతో ప్రార్ధించుము - ప్రత్యేక వాక్య భాగములను గురించి ప్రార్ధించండి. మీ ప్రణాళికకు సంబంధించిన లేఖన పరమైన ప్రార్ధనలు అలాగే అనేక కీర్తనలను ఉచ్చరించుచు ప్రార్ధించండి.  

వందనములు - మీ జీవితములో సంభవించిన విషయాల పరంగా, మీ కుటుంబ పరంగా, మరియు సంఘ పరంగా దేవునిని స్తుతించండి.  

పాడుట - స్తుతి లేక ఆరాధన కీర్తనలు లేక పాటలు లేక ఆత్మీయ గీతములను పాడండి.  

ధ్యానించుట - దేవుడు మీతో మాట్లాడునట్లు అడగండి. ఆయన మీతో మాట్లాడిన వాటిని వ్రాయునట్లు ఒక పెన్ను మరియు పేపరు తీసుకోండి.  

వినుట - మీరు చదివిన విషయములను, మీరు ప్రార్ధించిన విషయములను మరియు మీరు పడిన విషయములను కలుపుటలో సమయాన్ని గడపండి మరియు దేవుడు మీతో మాట్లాడునట్లు వాటన్నిటిని ఎలా కలిపి తీసుకువచ్చునో చూడండి.

స్తుతి - మీరు ఆయనతో గడిపవలసిన సమయమును మరియు ఆయన మీకిచ్చిన ప్రభావములను గురించి ప్రభువును స్తుతించండి. ఆయన మహిమయుక్తమైన గుణలక్షణములను గురించి ఆయనను స్తుతించుము.

డిక్ ఈస్ట్‌మాన్ యొక్క పుస్తకం ది అవర్ దట్ చేంజ్ ది వరల్డ్ © 2002 డిక్ ఈస్ట్‌మన్ ద్వారా, ఛోసెన్ బుక్స్, గ్రాండ్ రాపిడ్స్, MI, అనుమతి ద్వారా ఉపయోగించబడింది.

మిమ్మును మీరే ప్రశ్నించుకోండి

మీ ప్రార్థన జీవితాన్ని పెంచుకోవడానికి మీరు ఏ క్రమాన్ని మార్చాలి లేదా ఆపి వేయాలి?

ఈరోజే Zúme Training ప్రారంభించండి

ఇది పూర్తిగా ఉచితం, మరియు మీరు ఎప్పుడైనా ప్రారంభించవచ్చు—మీరు ఉన్న చోట నుంచే, మీ స్వంత వేగంతో ముందుకు సాగవచ్చు.

ఉచితముగా నమోదు చేసుకోండి